వరుణ్ అరెస్టును అపిన హైకోర్టు

అంతకు ముందు వరణ్ గాంధీ తరఫు న్యాయవాది ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చి సమాధాన పత్రం అందజేశారు. తన గొంతును అనుకరిస్తూ తనవి కాని వ్యాఖ్యలను సిడిలో చేర్చారని, నిజానికి ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని వరుణ్ గాంధీ ఎన్నికల కమిషన్ కు తెలియజేసినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి వరణ్ కు శుక్రవారం ఉదయం 11 గంటల వరకు గడువు ఉంది.
ఇదిలా వుంటే, ఉత్తరప్రదేశ్ అధికారులు వరుణ్ ఉంటున్న నివాసానికి వచ్చి ఆయన ప్రసంగం ఉన్న సిడిని అందజేశారు. వరుణ్ తన తల్లి మేనకా గాంధీ నివాసంలో ఉంటున్నారు. తాను ఎన్నికల విధి మీద వచ్చామని ఉత్తరప్రదేశ్ అధికారులు చెప్పారు. వివరాలు తెలియజేయడానికి వారు నిరాకరించారు. సిడిని ఇవ్వడానికి ఉత్తరప్రదేశ్ అధికారులు వచ్చినట్లు వరుణ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ముందస్తు బెయిల్ కోసం వరుణ్ గురువారం దరఖాస్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications