రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
హైదరాబాద్: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించారు. వీరిని హైదరాబాదులోని రాంనగర్ కు చెందిన ఓంకార్, రాజు లుగా గుర్తించారు. మోటార్ సైకిల్ వేగం వల్ల అదుపు కాలేదని, దీంతో డివైడర్ కు ఢీకొట్టిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications