న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి వీరప్ప మెయిలీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. రాష్ట్రంలోని 42 లోకసభ, 290 రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. విశాఖపట్నం లోక్ సభ టికెట్ ను పురంధరేశ్వరికి ఖరారు చేశారు. కడప లోక్ సభ టికెట్ వైఎస్ జగన్ కు లభించింది. మిగితావన్నీ ఇదివరకు వచ్చిన పేర్లే. సిటింగ్ ఎంపీలందరికీ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చింది. నాలుగు అసెంబ్లీ స్ధానాల విషయంలో ఇంకా పీట ముడి వీడలేదు.