హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరినా జయసుధ సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ సాధించుకోగలిగారు. ఆమెకు టిడిపికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మధ్యనే ఈ స్ధానం నుంచి ప్రధానంగా పోటీ ఉంటుంది. శ్రీనివాస్ యాదవ్ మీద గెలవడం ఆమెకు కష్టమైనా, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న క్రిస్టియన్ ఓట్లు జయసుధకు ప్లస్ పాయింట్. జయసుధ కొన్నేళ్ళ క్రితం క్రిస్టియన్ మతం పుచ్చుకున్న విషయం తెలిసిందే.