సత్తా ఉంటే మమ్మల్ని ఆపండి: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: సత్తా వుంటే వచ్చే ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దమ్ముంటే సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపించాలని కూడా ఆయన సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రధాన సర్వేలన్నీ కాంగ్రెసు విజయం సాధిస్తుందని చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు.అభివృద్ధి పనుల విషయంలో తమ ప్రభుత్వంపై ప్రజలకు ఫిర్యాదులు లేవని, ప్రజల్లో తమ పార్టీకి విశ్వసనీయత పెరిగిందని ఆయన చెప్పుకున్నారు.

తెలుగుదేశం, తదితర ప్రతిపక్షాలు విశ్వసనీయత కోల్పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం, వామపక్షాలు ప్రతిపక్షాలుగా విజయం సాధించి ఉంటే రాష్ట్రంలో మూడో పార్టీ వచ్చి ఉండేది కాదని ఆయన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. ప్రతిపక్షాలకు తగిన బలం ఉంటే చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చాలా తక్కువగా ఉందని, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల మధ్య చీలిపోయి తమ పార్టీకి మేలు జరుగుతుందని ఆయన అన్నారు. బావ హామీలకు బావమరిది భరోసా ఇవ్వడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ఆయన ఆయన చంద్రబాబు హామీలను అమలు చేయిస్తానని బాలకృష్ణ ప్రజలకు చెప్పడంపై వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+