ముంబయి: నానో కారుకు ఏప్రిల్ 9 నుంచి 23వ తేదీ వరకు బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుందని టాటా మోటార్స్ వెల్లడించింది. నానో కారు విడుదల సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ మొదట బుకింగ్ చేసుకున్న లక్ష మందికి మాత్రమే ముందుగా ప్రకటించిన లక్ష ధరకు నానో కారు అందిస్తామని ప్రకటించారు. పంత్ నగర్ టాటా కర్మాగారంలో 60 వేల వరకు నానో కార్లు తయారు చేస్తామన్నారు. అలాగే గుజరాత్ లోని సనంద్ కార్మాగారంలో వచ్చే ఏడాది ఆరంభం నుంచి నానోలను తయారు చేస్తామని అన్నారు.