పార్టీ రెబెల్స్ కు వైయస్ లేఖలు

ఆయన మంగళవారంనాడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం చేశారు. ఈ ప్రచార సభల్లో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్నింటినీ రద్దు చేస్తాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రజలు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగారని, తాము అడిగినవారికి అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చామని ఆయన అన్నారు. తాము గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications