రైలింజన్ పై 9 వరకు సస్పెన్స్
న్యూఢిల్లీ: రైలింజన్ గుర్తు తమదేనంటూ రాష్ట్రీయ క్రాంతికారీ సమాజ్‌వాది పార్టీ(ఆర్‌కేఎస్‌పీ) దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, ప్రజారాజ్యం పార్టీకి నోటీసులు జారీచేసింది. ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆర్‌కేఎస్‌పిీ పిటిషన్‌పై విచారణను ప్రారంభించింది. ఈనెల 9న దీనిపై తుది విచారణ జరుగుతుంది. ఆ రోజే తీర్పు వెలువడ వచ్చు.
తొమ్మిదవ తేదీలోగా నోటీసులకు ఈసీ సమాధానమివ్వాలని ఆదేశించింది. తమది గుర్తింపు పొందని జాతీయ పార్టీ అని..ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఉనికి ఉందని పిటిషన్‌లో ఆర్‌కేఎస్‌పీ పేర్కొంది. గతంలో తమ అభ్యర్థులు రైలింజన్ గుర్తుపై పోటీ చేసినందున దాన్ని మరెవ్వరికీ ఇవ్వొద్దని కోరింది.
రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు ఒకే గుర్తు కోసం పోటీపడినప్పుడు లాటరీ పద్ధతి ద్వారానే గుర్తులను కేటాయించాలన్న నియమాన్ని పాటించాలని పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోతగి వాదించారు. అయితే దురుద్దేశపూర్వకంగానే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని పీఆర్పీ న్యాయవాది దత్తా పేర్కొన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications