పది మంది భర్తలను మోసం చేసిన స్త్రీ
ముంబై: పది మంది భర్తలను మోసం చేసిన 32 ఏళ్ల కౌషర్ బేగం అనే మహిళను బెంగుళూర్ లో పోలీసులు అరెస్టు చేశారు. 18 ఏళ్ల కాలంలో కౌషర్ బేగం పది మంది ముంబై వ్యాపారవేత్తలను మోసం చేసింది. వారిని వివాహం చేసుకుని విడాకులిచ్చి, బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందనే ఆరోపణలపై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇందులో ఆమెకు సహకరించిన ఆమె తల్లిదండ్రులు గుల్నాజ్, ఇక్బాల్ పాషాలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
పొవాయ్ కి చెందిన 35 ఏళ్ల వయస్సున్న ఎగుమతిదారుడు సయ్యద్ అహ్మద్ సియోన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్లుగా కౌషర్ బేగం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అతను ఆరోపించాడు. వారు ముగ్గురు స్టార్ హోటళ్లలో తిరుగుతూ కౌషర్ బేగం వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుని పెళ్లి ప్రతిపాదనలు చేస్తూ ఉంటుందని, వారిని పెళ్లి చేసుకున్న తర్వాత వదిలేసి వచ్చి కట్నం వేధింపుల కింద, ఇతర ఆరోపణల కింద వేధిస్తూ వుంటుందని సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు చేసిన అహ్మద్ బేగం తొమ్మిదో భర్త. బేగంను అతను 2006లో పెళ్లి చేసుకున్నాడు. బంగారు, వజ్రాల నగలుతో 15 రోజులకే వదిలేసి వచ్చింది. బెంగుళూరులోని తల్లిదండ్రులతో ఉంటోంది.












Click it and Unblock the Notifications