• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విరాళాల కోసం చిరుపార్టీ పత్రికా ప్రకటన

By Staff
|
Prajarajyam
హైదరాబాద్: మార్పు కోసం నడుం కట్టిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి విరాళాలు ఇవ్వాలని పీఆర్పీ ఎన్నారై విభాగం ఒక పత్రికా ప్రకటనలో కోరింది. ఆ పత్రికా ప్రకటన పూర్తి పాఠమిది. భారతదేశంలో పౌరులందరికీ సామాజిక, రాజకీయ, ఆర్ధిక న్యాయాన్ని, సమాన అవకాశాలు, సమాన హోదా కల్పిస్తామని చాలా కాలంగా పాలకులంతా చెబుతున్నా దురదృష్టవశాత్తు ఈరోజుకీ ఆ ఆకాంక్షలు ఎండమావులుగానే మిగిలిపోయాయి. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పరిపాలించిన ఫూడల్ శక్తులకు ఇక కాలం చెల్లింది. ఇక రాబోయే కాలం సామాజిక వర్గాలదే. ఇప్పటివరకు అన్యాయానికి, నిర్లక్ష్యానికి గురైన సామాజిక వర్గాలే రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఎవరెన్ని ఉచిత వాగ్దానాలు చేసినా, సర్వేలతో ప్రజలను ఏమర్చాలని చూసినా సాద్యంకాదు.

ప్రజాసంక్షేమం ప్రభుత్వాల తొలిప్రాధాన్యత కావాలి. పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు కనీస అవసరాలను కల్పించాలి. ప్రజల మద్య అంతరాలు, అసమానతలు తొలగించాలి. బలహీన వర్గాలకు విద్యావకాశాలు, ఆర్ధిక మెరుగుబాటుకు ప్రత్యేక శ్రద్ద చూపాలి. సాంఘిక అన్యాయాలు, దోపిడీల నుండి ప్రజలను రక్షించాలి. ప్రజల జీవన, ఆర్ధిక ఆరోగ్య ప్రమాణాలను మెరుగు పర్చుటకు ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో, దేశంలో సుధీర్ఘకాలంపాటు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగ స్పూర్తిగా వ్యవహరించాయి.

జ్యోతీరావు ఫూలే, మహాత్మాగాంధీ, డా. బి.ఆర్. అంబేద్కర్, మధర్ ధెరిస్సా స్పూర్తితో ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ... ప్రజారాజ్యం విజయ శంఖారావంగా మారి చరిత్ర సృష్టించబోతుంది. ఇది తద్యం. మార్పు నినాదంగా, సామాజికన్యాయం ఆదర్శంగా, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా.. బోయలే పాలకులై పాలించే ప్రజారాజ్యం సాఫల్య దిశగా, ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుళ్ళ నుండి ఉదయించిన మన నాయకుడు మన చిరంజీవి. ప్రజారాజ్య సంస్థాపన, అవినీతి రహిత సమాజ స్థాపన.. సామాజిక న్యాయ వితరణ, మార్పు కోసం ఇప్పుడు మనందరి భాద్యత.

విరివిగా విరాళాలు ఇవ్వండి...మీభాగస్వామ్యాన్ని తెలియజేయండి. మీ భాగస్వామ్యం ఒక్క రూపాయి కావచ్చు..మీ హృదయ విశాలతను తెలుపండి. ప్రజారాజ్యం బడుగుల పక్షం నిలిచే పార్టీ...నిరిపేదల వర్గాల అభ్యున్నతికి కట్టుబడ్డ పార్టీ. మీరిచ్చే విరాళం వృధా పోదు...సేవారంగంలో పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి తోడుగా, విరాళాల సేకరణ...ప్రజారాజ్యం అందరిదీ అని చెప్పేందుకు ఒక చక్కని మార్గం.

బ్యాంకుకు వెళ్ళి నగదు డిపాజిట్ / వైర్ ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకునే వారికి బ్యాంకు వివరాలు
అకౌంట్ నెం: 737010138999
బ్యాంక్: ఐఎన్‍జీ వైశ్యా బ్యాంకు, బంజారా హిల్స్, హైదరాబాద్
ఇన్ ఫేవరాఫ్ ఆఫ్ : ప్రజారాజ్యం పార్టీ
(SWIFT CODE: VYSAINBBSPR)

With
CITI Bank N A
111, Wall Street
New York NY – 10043
SWIFT code: CITIUS33XXX

చెక్కు పంపించవలసిన వాళ్ళు ఈ క్రింది చిరునామాకు పంపగలరు.
ప్రజారాజ్యం రిజిస్టర్డ్ ఆఫీసు,
ప్లాట్ నెం. 192, రోడ్ నెం. 46, జూబ్లీ హిల్స్,
హైదరాబాద్ - 500033. ఫొన్: 040-23337444/666/888
ఈ-మెయిల్: info@prajarajyam.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X