విశాఖలో 4 గురు విద్యార్ధినుల మృతి
విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థినులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌లోని మహేశ్వరం వద్ద ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు సందర్శనార్థం విశాఖ వెళ్లారు. స్టీల్‌ప్లాంట్ వద్దకు వచ్చిన వారు రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో నలుగురు విద్యార్థినులు మృతి చెందగా మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందినవారిని పద్మావతి, రాధిక, మాధవి, స్రవంతిలుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications