భార్యతో వచ్చి ఓటేసిన బాలయ్య

తెలుగుదేశం నాయకుడు అశోక్ గజపతి రాజు విజయనగరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకురాలు విజయశాంతి హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభా నియోజక వర్గంలో తన ఓటు వేశారు. బిజెపి నాయకుడు ఇంద్రసేనా రెడ్డి మలక్ పేట శాసనసభా నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాను వచ్చిన సమయంలో ఇవియంలు సరిగా పనిచేయకపోవడంతో ఆయన అరగంట పాటు వేచి ఉండాల్సి వచ్చింది. సూర్యాపేటలో మంత్రి దామోదర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మెదక్ నియోజక వర్గంలో తన ఓటు వేశారు.












Click it and Unblock the Notifications