కర్నాటకలో 12 మంది ఆంధ్రుల మృతి
సంగారెడ్డి: భవానీ మాత దర్శనానికి వెళుతుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం నాగిశెట్టి తండాకు చెందిన వారు తుల్జాపూర్ భవానీమాత దర్శనానికి వ్యానులో బయలుదేరారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా మన్నెకెల్లి వద్ద వీరి వ్యానును జీపు ఢీకొనగా 14 మంది మరణించారు.
సోమవారం రాత్రి 8, 9 గంటల మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో 12 మంది నాగిశెట్టి తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మిగతా ఇద్దరు వ్యాన్, జీపు డ్రైవర్లు. 11 మంది అక్కడికక్కడే మరణించగా ఒకరు హైదరాబాదులోని అస్పత్రికి తరలిస్తుండగా మరణించారు.












Click it and Unblock the Notifications