రోడ్డు ప్రమాదంలో 3గురు మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం బసిరెడ్డిపాలెం నుంచి బత్తాయిల లోడుతో వెళుతున్న లారీ కంభంవైపు వస్తుండగా బసిరెడ్డిపాలెం వద్ద బోల్తా కొట్టింది. దీనిపై 50 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కారు. ఓవర్ లోడ్ కారణంగా లారీ బోల్తాపడటంతో ప్రయాణీకులు కింద పడ్డారు. వారిపై బత్తాయిల లారీ పడింది. దీంతో వారు బయటకు రాలేక 3గురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను కంభం ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన 20 మందిలో 5గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications