ఈసీది కాంగ్రెస్ పక్షపాతం: మాయ

ఇసిగా నవీన్ చావ్లా నేతృత్వంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని ఆమె వ్యాఖ్యానించారు. నవీన్ చావ్లా, ఎస్వై ఖురేషీ కాంగ్రెసు కోటరీలోని మనుషుల్లాగా పని చేస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో సొంత ప్రయోజనాల కోసం ఖురేషీ ప్రయత్నిస్తున్నారని, దీంతో ఖురేషీ కాంగ్రెసుకు, సమాజ్ వాదీ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నవీన్ చావ్లాకు వ్యతిరేకంగా గోపాలస్వామి రాష్ట్రపతికి లేఖ రాసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఏ సిఇసి మీద కూడా అంత తీవ్రమైన ఆరోపణలు రాలేదని, ఈ పరిస్థితుల్లో చావ్లా తనంత తాను రాజీనామా చేయాల్సి ఉండిందని, కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications