తిరుపతి: తిరుమల ఏడు కొండలవాడి దయ ప్రజారాజ్యం అభ్యర్థులపైనే ఉందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి తానే గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన తిరుపతిలో ముగింపు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరాచక శక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. తొలి విడత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, తెలంగాణలో ప్రభంజం సృష్టించిన పీఆర్పీ రెండో విడత ఎన్నికల్లోను ఈ ఊపును కొనసాగించి అధికారం చేపడుతుందని చిరంజీవి వెల్లడించారు.