హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మహాకూటమి ద్వారా తెలంగాణ వస్తే ఆ కూటమిలోని శక్తుల ద్వారా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, కాంగ్రెస్ ద్వారా తెలంగాణ ఏర్పడితే ప్రశాంతంగా ఉంటుందనే విషయాన్ని తనదైన శైలిలో వైఎస్ చెప్పారని, వైఎస్ వ్యాఖ్యలపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ అంశానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని తెలిపారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.