పురూలియాలో పేలుడు: జవాన్లకు గాయాలు
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్‌లో మూడవ విడత పోలింగ్ సందర్భంగా గురువారం మందుపాతర పేలిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పురూలియా జిల్లాలోని బీరమడి పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మావోయిస్టులు ఈ మందుపాతర పేల్చినట్లు చెబుతున్నారు.
జవాన్లు గస్తీ తిరుగుతుండగా మావోయస్టులు గురువారం ఉదయం 7 గంటల 50 నిమిషాల ప్రాంతంలో మందుపాతర పోల్చినట్లు, దీంతో పోలింగ్ నిలిచిపోయినట్లు పోలీసు సూపరింటిండెంట్ రాజేష్ యాదవ్ చెప్పారు. సంఘటనా స్థలానికి ఆయన వెంటనే చేరుకున్నారు. పురూలియా జిల్లా కోల్ కత్తాకు 295 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.












Click it and Unblock the Notifications