మిత్రుడు షోకు బ్రేక్: ఫ్యాన్స్ వీరంగం
హైదరాబాద్: బాలకృష్ణ నటించిన మిత్రుడు సినిమా ప్రదర్శనకు హైదరాబాదులోని పంజగుట్ట సెంట్రల్ పివిఆర్ హాల్లో బ్రేక్ పడింది. దీంతో బాలకృష్ణ అభిమానులు వీరంగం సృష్టించారు. సినిమా హాల్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. సినిమాను ప్రదర్శించాల్సిందేనని పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. అయితే జనరేటర్ చెడిపోవడం వల్ల సినిమాను ప్రదర్శించలేక పోతున్నామని యాజమాన్యం చెప్పింది. అయినా బాలకృష్ణ అభిమానులు వెనక్కి తగ్గలేదు.
మిత్రుడు సినిమా ప్రదర్శనకు అపేయడానికి రాజకీయ కుట్ర జరుగుతోందని బాలకృష్ణ అభిమానులు విమర్శించారు. సినిమా చూడదలుచుకోలేని వారు వెళ్లిపోవచ్చునని యజమానులు చెప్పారు. అయితే సినిమాను ప్రదర్శించి తీరాల్సిందేనని అభిమానులు మొండికేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేశారు.












Click it and Unblock the Notifications