బోర్గే మృతి: ముగ్గురికి క్లీన్ చిట్
ముంబయి: ఎయిర్ వర్క్స్ సాంకేతిక నిపుణుడు భరత్ బోర్గే మృతి కేసులో రైల్వే పోలీసులు అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్)కు చెందిన ముగ్గురు ఉద్యోగులకు శుక్రవారం క్లీన్ చిట్ ఇచ్చారు. వారి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. ఈ ముగ్గురు అధికారులు బోర్గేను కలీనాలోని ఎయిర్ వర్క్స్ హాంగర్లో కలిశారు. ఆ తర్వాతి రోజే బోర్గే మృతదేహం రైల్వే ట్రాక్ వద్ద కనిపించింది.
బోర్గే మృతిలో వారి పాత్ర ఉందని అనుకోవడం లేదని, వారు అతి సాధారణంగానే బోర్గేను కలిసి మాట్లాడారని ప్రభుత్వ రైల్వే అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ప్రకాష్ సావంత్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. అనిల్ అంబానీ హెలికాప్టర్ గియర్ బాక్స్ లో గులకరాళ్లు, బురద ఉన్న విషయాన్ని కనిపెట్టింది బోర్గేనే. దీంతో అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లీన్ చీట్ లభించినవారు-మాజీ డిజిపి, సెక్యూరిటీ ఆఫీసర్ కెకె కశ్యప్, రిటైర్డ్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ శైలేష్ కాలేద, కంపెనీ ఎవియేషన్ సెక్యురిటీ ఆఫీసర్ సావ్లా. రిలయన్స్ అధికారులు కలిసి తన టెలిఫోన్ నెంబర్ తీసుకున్నారని బోర్గే రాసి పెట్టిన లేఖ పోలీసులు చేతికి చిక్కింది. దాంతో రైల్వే పోలీసులు ఆ ముగ్గురు అధికారులను విచారించారు.












Click it and Unblock the Notifications