కాశ్మీర్ లో ఇద్దరు మిలిటెంట్ల హతం

జమ్ము: జమ్ము కాశ్మీర్ లోని దోడా జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ తో పాటు అతని అనుచరుడు హతమయ్యారు. ఉగ్రవాదుల ఉన్నారనే సమాచారం అందడంతో శుక్రవారం సాయంత్రం సైన్యం, పోలీసు బలగాలు దోడా జిల్లాలోని ధర్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారం ఉదయం ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయని దోడా రేంజ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ హేమంత్ లోహియా చెప్పారు.

ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా జిల్లా కమాండర్ అబూ సమామా, అతని అంగరక్షకుడు బర్కత్ అలీ మరణించారు. సమామా పాకిస్తాన్ దేశీయుడు కాగా అలీ స్థానికుడు. గత నాలుగైదేళ్లుగా సమామా ఈ ప్రాంతంలో పని చేస్తున్నాడు. ఎదురు కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. సంఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+