బెంగాల్ లో ఘర్షణలు: 6గురు మృతి
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నందిగ్రామ్ లో సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య శనివారం తాజాగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. నందిగ్రామ్ సమీపంలోని గోకుల్ నగర్ లో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మరణించగా, హుగ్లీ జిల్లాలోని ఉల్బేరియాలో జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు.
ఘర్షణలకు సంబంధించి పోలీసులు పది మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. అయితే వారిపై ఏ విధమైన నేరారోపణలూ చేయలేదు. నందిగ్రామ్ ప్రాంతంలో గురువారం నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. గురువారంనాడు బిడ్డను ఎత్తుకుని ఇంటి వెలుపలికి వచ్చిన మహిళలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బిడ్డ సానియా మృతి చెందింది. తల్లి అలియా కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఇందుకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ శనివారం బంద్ తలపెట్టింది.












Click it and Unblock the Notifications