ఖురాన్ రాతలో బాలిక రికార్డు
హైదరాబాద్: హైదరాబాదుకు చెందిన ఒక పాఠశాల విద్యార్థిని 999 అడుగుల ఖురాన్ ను ఉర్దూ భాషలో రాసింది. ఆ ఖురాన్ రాసిన బాలిక తేజశ్రీ తండ్రి బాలు కూడా ప్రముఖ కళాకారుడు. ఆ బాలిక హైదరాబాదులోని లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది.
తేజశ్రీ ఖురాన్ పాఠం రాయడాన్ని ఏప్రిల్ 23వ తేదీన ప్రారంభించింది. ఆమె దీని ద్వారా గిన్సిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం కోసం ప్రయత్నిస్తోంది. తేజశ్రీ తాను రాసిన ఖురాన్ రాతప్రతిని మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అందజేసింది. చంద్రబాబును ఆమె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసింది.












Click it and Unblock the Notifications