యుఎస్ మిలిటరీ బేస్ పై దాడి
ఖోస్త్: అఫ్గనిస్తాన్ తూర్పు ప్రాంతంలో అమెరికా మిలిటరీ బేస్ పై ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. యుఎస్ మిలిటరీ ఈ విషయం చెప్పింది. కోస్త్ లోని యుఎస్ మిలిటరీ బేస్ పై తామే దాడి చేశామని తాలిబాన్ ప్రకటించుకుంది. అఫ్గనిస్తాన్ లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 9 మంది మరణించారు.
పని ప్రారంభించడానికి కార్మికులు గేట్ వద్ద నిరీక్షిస్తున్న సమయంలో ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. మృతుల్లో చాలా మంది కార్మికులే ఉండి ఉంటారని భావిస్తున్నారు. అయితే వారెవరనేది నిర్ధారణ కాలేదు. దాడులు చేయడానికి కారు బాంబు పట్టణంలోకి వచ్చినట్లు తాలిబాన్ కు చెందినవాడిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి మీడియా ప్రతినిధులతో చెప్పాడు. సాలా హుద్దీన్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications