విజయయాత్రలు: కలెక్టర్లకు పవర్
హైదరాబాద్: ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులు జరుపుకునే విజయయాత్రలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలించింది. విజయయాత్రల నిర్వహణపై ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే తుది నిర్ణయం తీసుకుంటారని ఎన్నికల ప్రధానాధికారి ఐవీసుబ్బారావు తెలిపారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతించాలన్న రాజకీయపార్టీల విజ్ఞప్తిలను ఈసీ పరిగణలోకి తీసుకుంది. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మొదట ఈసీ విజయోత్సవ ర్యాలీలను నిషేధించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications