అద్వానీతో చర్చలు జరపలేదు: బిఎస్పీ

మాయావతి మద్దతు అటు ఎన్డీయెకు, ఇటు యుపిఎకు కీలకంగా మారిన సమయంలో ఇరు పక్షాలు ఆమెను దువ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. తాను ప్రధాని అయ్యే అవకాశాలు లేకపోతే మాయావతి కాంగ్రెసు శిబిరంలో చేరి, మంత్రి పదవిని ఆశించవచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ముస్లిం ఓటర్లకు దూరమయ్యే విధంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీయెకు బిఎస్పీ మద్దతివ్వబోదని అంటున్నారు. కళ్యాణ్ సింగ్ ఎస్పీలో చేరడంతో బిఎస్పీకి ముస్లిం ఓటర్ల మద్దతు పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం మాయావతి వామపక్షాల నేతలతో సంబంధాల్లో ఉన్నారని చెబుతున్నారు. బిఎస్పీకి 30 లోకసభ స్థానాలు రావచ్చునని, కేంద్రంలో ఈ సీట్ల ద్వారా బిఎస్పీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications