కూలిన మిగ్: ఏడుగురికి గాయాలు
జోథ్ పూర్: జోథ్ పూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం మిగ్-27 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి కూలిపోయింది. దీంతో కింద ఉన్న ఏడుగురు గాయపడ్డారు. పైలట్ సురక్షితంగా బయట పడ్డాడు. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం కొంకణి గ్రామంలో ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో కింద ఉన్న ఏడుగురు గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జోథ్ పూర్ ఎస్పీ (రూరల్) శరద్ కవిరాజ్ చెప్పారు.












Click it and Unblock the Notifications