ఒయులో ఆందోళన: విద్యార్థుల అరెస్టు
హైదరాబాద్: బలవంతంగా హాస్టల్ గదులను ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయం యాజమాన్యం చర్యను నిరసిస్తూ వారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు హైదరాబాదులోని విద్యానగర్ వద్ద అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారు జామున విశ్వవిద్యాలయం అధికారులు హాస్టళ్లకు వచ్చి గదులను ఖాళీ చేయించడం మొదలు పెట్టారు. దీన్ని విద్యార్థులు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. దీంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాళాలు వేసిన గదులను కూడా అధికారులు వదిలేయలేదు. తాళాలు పగులగొట్టి గదుల్లోని సామాన్లను బయటకు విసిరేశారు. ఈ నెల 22వ తేదీ వరకు పోటీ పరీక్షలున్నాయని, కొంత మందికి బ్యాక్ లాగ్ లు కూడా ఉన్నాయని చెబుతూ ఈ నెల 20వ తేదీ వరకు హాస్టళ్లలో ఉండడానికి అనుమతివ్వాలని విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారులను కోరారు. దానికి అంగీకరించిన విశ్వవిద్యాలయం యాజమాన్యం అకస్మాత్తుగా మంగళవారం ఉదయం గదులను ఖాళీ చేయించడానికి పూనుకుంది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications