శ్రీలంకపై కరుణతో నారాయణన్ భేటీ
న్యూఢిల్లీ: ఎల్టీటిఇ ఓటమి, ఆ సంస్థ అధినేత వి. ప్రభాకరన్ మృతి సంఘటన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్ శ్రీలంకు బయలుదేరి వెళ్తున్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి ఆయన శ్రీలంక వెళ్తున్నారు. శ్రీలంకలోని తమిళుల పరిస్థితిపై భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వారికి పునరావాసం కల్పించాలని కోరుతోంది.
కొలంబోకు బయలుదేరే ముందు నారాయణన్ డిఎంకె నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధిని కలిశారు. శ్రీలంకలోని పరిస్థితిపై ఆయన వివరించారు.శ్రీలంకలోని తమిళుల పరిస్థితిపై కరుణానిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను శ్రీలంకకు వెళ్తున్నానని, దానికి ముందు కరుణానిధి సలహా తీసుకోవడానికి వచ్చానని నారాయణన్ చెప్పారు.
తమిళుల ప్రయోజనాలు కాపాడుతామని ఆయన చెప్పారు. ప్రభాకరన్ మృతిపై తమకు అంతకన్నా ఎక్కువ సమాచారం లేదని, శ్రీలంకకు వెళ్లిన తర్వాత పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తమిళుల పునరావాసానికి భారత ప్రభుత్వం 500 కోట్ల పునరావాస ప్యాకేజీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications