రాష్ట్రపతితో సోనియా, మన్మోహన్ భేటీ

Sonia Gandhi
న్యూఢిల్లీ: తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్లమెంటరీ పార్టీ నేత మన్మోహన్ సింగ్ బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను కలవనున్నారు. మద్దతు లేఖలతో వారు ప్రతిభా పాటిల్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కలుస్తారు. రాష్ట్రపతిని వారు సాయంత్రం ఐదు గంటలకు కలుసుకుంటారు.

ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని కలవాలని బుధవారం ఉదయం జరిగిన ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యుపిఎ సమావేశంలో కూటమి చైర్ పర్సన్ గా సోనియా గాంధీ ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకున్న పార్టీలతో, ఇతర పార్టీలు కొన్ని యుపిఎకు మద్దతు ప్రకటించాయి. దీంతో యుపిఎ బలం లోకసభలో 316 సభ్యులకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+