న్యూఢిల్లీ: తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తానని ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. విస్తరణ సమయంలో ఫరూఖ్ అబ్దుల్లాను మంత్రివర్గంలోకి తీసుకుంటానని మన్మోహన్ చెప్పినట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధలతో చెప్పారు. మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి అబ్దుల్లాతో మాట్లాడారు. మంత్రివర్గంలో తమను చేర్చుకుంటారో లేదో అనుమానాలు నేషనల్ కాన్ఫరెన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మన్మోహన్ సింగ్ ఆ హామీ ఇచ్చినట్లు ఒమర్ చెప్పారు.
తాము ఆగ్రహించడానికి మన్మోహన్ సింగ్ అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు. మంత్రి వర్గంలో తమను చేర్చుకుంటారో లేదో తెలియడం లేదని, తమకు కాంగ్రెస్ నాయకులు ఏ విషయమూ చెప్పడం లేదని ఒమర్ అబ్దుల్లా గురువారం అసంతృప్తి వ్యక్తం చేశారు.