మాజీ దేశాధ్యక్షుని ఆత్మహత్య

మానవహక్కుల లాయర్‌గా పేరుగాంచిన రోహ్ 2003 నుంచి 2008 వరకు దక్షిణ కొరియా అధ్యక్షుడిగా పనిచేశారు. క్లీన్ పొలిటీషియన్ గా ఆయన పేరుపొందారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు ప్రచారం చేయరాదన్న నిబంధనను ఉల్లంఘించినందుకు సభ ఆయనపై అవిశ్వాసతీర్మానం పెట్టి పదవినుంచి దించివేసింది. అనంతరం కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షుడిగా ఉండగా ఓ సారి దేశంలోని ఓ వ్యాపారవేత్తనుంచి లంచం తీసుకున్నారని ఆయన పదవినుంచి దిగిపోయిన అనంతరం ఆరోపణ వచ్చింది. దీంతో ఆయనను కోర్టు విచారిస్తోంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఆయన తీవ్ర అవమానానికి, ఆత్మక్షోభకు గురయ్యారు. శనివారం ఉదయం 8.30కు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు.












Click it and Unblock the Notifications