చంపటానికే తీసుకొచ్చారు: కూరరాజన్న
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు పటేల్ సుధాకర్‌రెడ్డిని మహారాష్టల్రోని నాసిక్ మూడు రోజుల క్రితం పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి చంపారని జనశక్తి అగ్రనేత కూర రాజన్న అన్నారు. వరంగల్ జిల్లా లవ్వాట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని విమర్శించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యకేసులను నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌ను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. సుధాకర్‌ను ఎక్కడో పట్టుకొచ్చి ఇక్కడ చంపారని, ఇది పచ్చి బూటకమని ఆయన భార్య వనజ అన్నారు. తాను కూడా దళంలో పనిచేశానని ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇది బూటకపు ఎన్‌కౌంటరనే తెలుస్తోందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications