ఎన్ కౌంటర్ పై విచారణకు డిమాండ్
వరంగల్: మావోయిస్టు నాయకులు పటేల్ సుధాకర్ రెడ్డి, వెంకటయ్యల ఎన్ కౌంటర్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్సీ) డిమాండ్ చేసింది. ఎన్ కౌంటర్ జరిగిన వరంగల్ జిల్లాలోని తాడ్వాయి అడవుల్లోని ప్రదేశాన్ని ఎపిసిఎల్సీ ప్రతినిధులు సోమవారం సందర్శించారు. అక్కడ ఎదురు కాల్పులు జరిపిన దాఖలాలు కనిపించడం లేదని ఎపిసిఎల్సీ ప్రధాన కార్యదర్శి క్రాంతిచైతన్య అన్నారు. నక్సల్స్ నాయకులను పట్టుకొచ్చి ఇక్కడ కాల్చి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
పటేల్ సుధాకర్ రెడ్డి, వెంకటయ్యల మృతదేహాలకు కోర్టు ఆదేశాల మేరకు రీపోస్టు మార్టం నిర్వహించారు. పటేల్ సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో రేపు జరుగుతాయి. ఎన్ కౌంటర్ పూర్తిగా బూటకమని విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకుడు వరవర రావు విమర్శించారు. పటేల్ సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని చూడడానికి ఆస్పత్రికి వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications