పటేల్ రీ పోస్టుమార్టంలో ప్రతిష్టంభన
వరంగల్: వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మవోయిస్టు అగ్ర నేతలు పటేల్ సుధాకరరెడ్డి, వెంకటయ్యల రీపోస్టుమార్టంలో ప్రతిష్టంభన ఏర్పడింది. వారికి ఎంజీఎం ఆసుపత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కనుక రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టులో కేసు దాఖలు కావటంతో రీపోస్టుమార్టంకు హైకోర్టు ఆదేశించింది. అయితే ఆదేశాలు తమకు అందలేదని పోలీసులు అంటున్నారు.
అయితే ఎట్టకేలకు రీ పోస్టు మార్టం కు సంబంధించిన కోర్టు ఆదేశాలు వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ సజ్జనార్ కు అందాయి. దీంతో రీ పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. వెంకటయ్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు విప్లవ రచయితల సంఘం (విరసం)నేత వరవరరావు, ఇతర ప్రజా సంఘాల నేతలు ఇక్కడికి వచ్చారు.












Click it and Unblock the Notifications