కేంద్ర క్యాబినెట్ విస్తరణ వాయిదా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. నిజానికి మంగళవారంనాడు మన్మోహన్ సింగ్ మంత్రి విస్తరణ జరగాల్సి ఉంది. డిఎంకెతో చర్చలు కొలిక్కి వచ్చాయని భావిస్తున్న తరుణంలో తృణమూల్ కాంగ్రెసు మెలిక పెట్టింది. తృణమూల్ కాంగ్రెసు మరో సహాయ మంత్రి పదవిని డిమాండ్ చేస్తోంది. దీంతో మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంత్రి వర్గ విస్తరణపై మంగళవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ల మధ్య మంగళవారం చర్చలు జరిగాయి. తొలి విడత మన్మోహన్ సింగ్ 19 మంది మంత్రులను మాత్రమే తీసుకున్నారు. ఆరుగురు మంత్రులకు మాత్రమే శాఖలు కేటాయించారు. మంత్రి పదవులపై డిఎంకె డిమాండ్లపై కాంగ్రెసు చర్చలు కొలిక్కి రాకపోవడంతో మన్మోహన్ సింగ్ ఈ నెల 22వ తేదీన పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు.












Click it and Unblock the Notifications