26/11 హీరోకు పట్టిన గతి
ముంబయి: ఉగ్రవాదుల దాడి సందర్భంగా సాహసం ప్రదర్శించిన బాబ్లూ కుమార్ దీపక్ కు తగిన గౌరవం దక్కలేదు. దాడి జరిగిన రోజు ఆయన ఛత్రపతి శివాజీ టెర్మినస్ మైన్ లైన్ సెక్షన్ వద్ద అనౌన్సర్ గా పని చేస్తున్నారు. ఆ రాత్రి ప్రయాణికులను రక్షించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపే లభించలేదు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి వేలాది ప్రయాణికులను కాపాడారు. మరో అనౌన్సర్ విష్ణు జెండేను అప్రమత్తం చేశారు. దాడుల విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులకు, రైల్వే పోలీసు బలగాలకు తెలియజేశారు.
తాను రాత్రి విధుల్లో ఉన్నానని, 13, 14 ఫ్లాట్ ఫారాలపై బాంబులు విసురుతుండడాన్ని గమనించానని, భారీ పేలుడు సంభవించిందని, శవాలు కూడా కనిపించాయని, వెంటనే లోకల్ లైన్ లో అనౌన్సర్ గా ఉన్న విష్ణును అప్రమత్తం చేశానని ఆయన వివరించారు. దాంతో ఎంతో మంది ప్రాణాలతో బయట పడ్డారని ఆయన చెప్పారు.
విష్ణు జిండేకు పది లక్షల రూపాయలు బహుమతిగా లభించిందని, అయితే తనను గుర్తించనే లేదని, ఐదు నెలల తర్వాత ఈ ఏడాది మే 7వ తేదీన తన ధైర్యాన్ని గుర్తించి ఇండియన్ రైల్వేస్ వారు ఒక సర్టిఫికెట్, 500 రూపాయల బహుమతి ఇచ్చారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications