82కు చేరిన తుఫాను మృతులు

కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ ను తాకిన ఐలా తుఫాను వల్ల మరణించినవారి సంఖ్య 82కు చేరుకుంది. 24 పరగణాస్ జిల్లా తుఫాన్ తాకిడికి అతలాకుతలం అయింది. చెట్లు విరిగి పడ్డాయి. పవర్ కేబుల్స్ తెగిపడ్డాయి. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తుఫాను తాకిడికి 4 లక్షల మంది విలవిలలాడి పోయారు. డార్జిలింగ్ లో 22 మంది మరణించగా, నార్త్ 24 పరగణా జిల్లాలో 16 మంది మృతి చెందారు.

సౌత్ 24 పరగణాలో 15 మంది, కోల్ కత్తాలో 9 మంది మరణించారు. హౌరాలో ఏడుగురు, హూగ్లీలో ఐదుగురు, ముర్సిదాబాద్ లో ముగ్గురు, బిర్భూమిలో ఇద్దరు, మాల్దా, ఈస్ట్ మిడ్నాపూర్, బకురా ల్లో ఒక్కరేసి మరణించారు. ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మంగళవారం తుఫాను తాకిడి ప్రాంతాలను సందర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+