న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లో ఈరోజు జరిగిన మలివిడత ప్రమాణస్వీకార కార్యక్రమంలో మన రాష్ట్రం నుంచి అయిదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. స్వతంత్ర మంత్రిగా జైరాం రమేష్ ప్రమాణం చేయగా సహాయ మంత్రులుగా పళ్లంరాజు, పురంధరేశ్వరి, పనబాక లక్ష్మి, సాయిప్రతాప్ ప్రమాణస్వీకారం చేశారు. కేబినెట్ మంత్రిగా జైపాల్ రెడ్డి ఇప్పటికే ఉన్నారు. కేశవరావు, హనుమంతరావు మంత్రి పదవులు ఆశించినా దక్కలేదు.