హైదరాబాద్: " గెలుపే మన ఏకైక లక్ష్యం కాదు...అధికార పక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా టీడీపీ ఎన్నడూ ప్రజాపక్షమే అని మీరు రుజువు చేయాలి కష్టాల్లో మనతో ఉండేవారే నిజమైన కార్యకర్తలు" అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం శ్రేణులను మహానాడు సందర్భంగా ఉత్సాహపరిచారు. ప్రపంచంలో గొప్ప నాయకులంతా వరుస ఓటమిని పొందినవారేనని ఉదాహరణలతో చెప్పారు. ఓటమికి కుంగిపోకుండా పనిచేయాలని ఉద్భోదించారు. రాజకీయం అంటే వన్డే క్రికెట్ మ్యాచ్ కాదని, ఓర్పు వహిస్తే విజయం సొంతమని అన్నారు. ప్రజల ఆదరణ, తాతగారి దీవెనలవల్లే తాను ఈరోజు తన కాళ్లపై నిలుచున్నానని అన్నారు. పార్టీకోసం తన సేవలు ఎప్పడు అవసరమైనా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు మరో హీరో బాలకృష్ణ కూడా మాట్లాడారు.