హైదరాబాద్: దేశంలోనే తొలి మహిళా హోం మంత్రిగా నియమితులైన పి.సబితా ఇంద్రారెడ్డి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిని చేసినందుకు ఆమె రాష్ట్ర ప్రజలకు ధవ్యవాదాలు తెలిపారు. సచివాలయంలోని జె బ్లాక్ లో ఎనిమిదవ అంతస్తులో గల హోం మంత్రిత్వ శాఖ ఛాంబర్‌లో ఈ ఉదయం 11.30 గంటలకు ఆమె పదవీ స్వీకారం చేశారు. ఇంతకు ముందు హోం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి కూడా ఇదే ఛాంబర్‌నే ఉపయోగించగా కొత్త మంత్రి కూడా దీనినే ఎంచు కోవడం విశేషం.