సచివాలయంలో కొత్త మంత్రుల కళ
హైదరాబాద్: కొత్త మంత్రులు కొందరు ఈరోజు సచివాలయంలోని తమ కార్యాలయాల్లో కొలువు దీరారు. నిన్న సాయంత్రం వరకు మంత్రులకు కార్యాలయాలు కేటాయించక పోవటంతో బాధ్యతల స్వీకరణ ఈరోజుకు వాయిదాపడింది. చివరకు 27 మంది మంత్రులకు డీ, జే బ్లాకుల్లో చాంబర్లు కేటాయించారు. పాత శాఖలు కొనసాగిస్తున్న మంత్రులు రోశయ్య, ధర్మాన, పొన్నాల, ముఖేష్ గౌడ్, పిల్లి సుభాష్ చంద్ర బోస్ లకు తిరిగి అవే కార్యాలయాలు కేటాయించారు. మరో మంత్రి రఘువీరారెడ్డి కార్యాలయం పక్కగదికి మారింది. డి బ్లాకులో 13 మందికి, జే బ్లాకులో 9మందికి బీ బ్లాకులో ఇద్దరికి, ఏ బ్లాకులో ఒక్కరికి కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఈరోజు ప్రారంభోత్సవాలతో సచివాలయం కళకళలాడింది. మంత్రులు శిల్పా మోహన్ రెడ్డి, దానం నాగేందర్, ఆనం రాంనారాయణ్‌రెడ్డి, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఆర్ వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పి.రాంచంద్రారెడ్డి, మాణిక్య వరప్రసాద్, గాదె వెంకటరెడ్డి, పి.సత్యనారాయణ, పి.బాలరాజులకు కార్యాలయాలు కేటాయించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications