బంద్‌కు నక్సల్స్ పిలుపు
విశాఖ : మావోయిస్టు నేత పటేల్ సుధాకర్ రెడ్డి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు మన్యం బంద్‌కు నక్సల్స్ పిలుపునిచ్చారు. మన్యం పరిధిలోని అన్ని ప్రాంతాలు బంద్‌ను పాటించి విజయవంతం చేయాలని మావోయిస్టులు కోరారు.వారం క్రిందట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పటేల్ సుధాకరరెడ్డి పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుధాకర్‌రెడ్డి, అతనితో పాటు జిలాల కమిటీ సభ్యుడు డీసీఎం వెంకటయ్య కూడా మృతి చెందాడు. సుధాకర్‌రెడ్డి 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అలిపిరి వద్ద జరిపిన మావోయిస్టు దాడిలో ప్రధాన నిందితుడు.
దివంగత మాజీ హోంమంత్రి మాధవరెడ్డితో పాటు ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర హత్య కేసుల్లో కూడా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. సుధాకర్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ప్రాంతం మల్దకల్ మండలం కడ్తిరావుల చెరుకు చెందినవాడు. సుధాకర్‌పై రూ.12 లక్షల రివార్డు కూడా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.












Click it and Unblock the Notifications