జేసీకే ఇవ్వండంటూ వైయస్

దాంతో నిరాశకు గురైన జేసీ ప్రొటెం స్పీకరుగా వ్యవహరిస్తారో లేదో పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి రోశయ్య ఆయనకు ఫోనుచేశారు. ప్రొటెం స్పీకరుగా ఉండాలని కోరారు. తానెందుకని జేసీ ప్రశ్నించగా..దివాకరరెడ్డే ప్రొటెం స్పీకర్ ఉండాలని వైఎస్ చెప్పారని మంత్రి తెలిపారు. జేసీ అంగీకరించారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన ప్రొటెం స్పీకరుగా ప్రమాణం చేస్తారు. అనంతరం 10.30కి 13వ శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు.
సాధారణంగా ఎక్కువసార్లు ఎన్నికైన వారిని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకునే విధానాన్ని అమలు చేస్తూంటారు. ఆ రకంగా చూస్తే ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పి.అశోక్ గజపతి రాజు ఈ పదవికి అర్హుడు. కానీ, అధికార పార్టీ మాత్రం ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన కె.జానారెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, జేసీ దివాకరరెడ్డిల పేర్లు పరిశీలించింది ఈ నిర్ణయం చేసింది.












Click it and Unblock the Notifications