276 మంది ఎమ్మెల్యేల ప్రమాణం
హైదరాబాద్: బుధవారం ఉదయం ప్రారంభమైన 13వ శాసనసభా సమావేశాల మొదటి రోజున.. 276 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ జేసీ దివాకర్ రెడ్డి వీరిచేత ప్రమాణ చేయించారు. ముఖ్యమంత్రి వైయస్, విపక్షనేత చంద్రబాబు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, లోక్‌సత్తా నుంచి జేపీ తదితరులు ప్రమాణం చేసిన ముఖ్యుల్లో ఉన్నారు. ఇంకా 17 మంది సభ్యులు ప్రమాణం చేయాల్సి ఉండగా..రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జేసీ సమక్షంలో ప్రమాణం చేయడానికి నిరాకరించి అసెంబ్లీ నుంచి వెనుదిరిగారు. నిన్న మృతి చెందిన టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి అంత్యక్రియల్లో ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రులు ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామారావులు రేపు ప్రమాణం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications