వర్షాలకు ఇంకా కొన్ని రోజులు
విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రవేశించిన రుతుపవనాలు కదలిక లేకుండా ఉండడంతో ఇంకా వర్షాలు పడడం లేదు. సోమవారం ప్రవేశించిన నైరుతి రుతుపవనాలలో మంగళవారం ఎటువంటి కదలిక లేదు. కేరళ, అండమాన్ లలో చురుగ్గా కదిలినా రాష్ట్రంలో ప్రవేశించిన తరువాత పురోగమించడానికి వాతావరణ పరిస్థితులు ఒకింత అనుకూలంగా లేవని నిపుణులు తెలిపారు.
రెండవ విడతలో రుతుపవనాల కదలికకు ఈ నెల ఆరులోగా ఏర్పడనున్న అల్పపీడనం దోహదం చేస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications