విషమిచ్చి సంపర్క్ రైల్లో దోపిడీ
వరంగల్: తోటి ప్రయాణీకులకు మత్తుమందు ఇచ్చి ఆభరణాలు, సొమ్ము చోరీ చేసిన ఘటన వరంగల్ జిల్లాలో సోమవారం జరిగింది. వరంగల్ జిల్లాలోని ఖాజీపేట జంక్షన్ లో ఢిల్లీ నుంచి వస్తున్న సంపర్క్ ఎక్స్‌ప్రెస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు తోటి ప్రయాణీకులతో ఎంతో బాగా మాట్లాడుతూ నమ్మించి తినే పదార్థాలు ఇచ్చారు. అవి తీసుకున్న వారు అయిదుగురు స్పృహ కోల్పోయారు.
స్పృహ కోల్పోయిన ప్రయాణికుల నుంచి ఆభరణాలు, సొమ్ము తీసుకుని ఆగంతకులు పరారయ్యారు. తోటి ప్రయాణీకులు గమనించి రైల్వే అధికారులకు తెలియజేయటంతో స్పృహ కోల్పోయిన ఐదుగురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐస్ క్రీంలో విషం కలిపి దుండగులు ఐదుగురు తోటి ప్రయాణికులకు ఇచ్చారు.












Click it and Unblock the Notifications