టిడిపిలోనే ఉంటా: ప్రసన్న
హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆ పార్టీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాలపై విమర్శలు గుప్పిస్తూ ఆయన మంగళవారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. దాంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. తాను కాంగ్రెసు పార్టీలో చేరబోనని ఆయన బుధవారం ఉదయం ఒక టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు.
తాను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని, అయితే నియోజక వర్గం అభివృద్ధి పనుల గురించి మాత్రమే తాను ముఖ్యమంత్రిని కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. పార్టీలో కొంత మంది నాయకుల తీరు బాగా లేదని, అందుకే తాను ఆ బహిరంగ లేఖ రాశానని ఆయన చెప్పారు. అప్పుడప్పుడు ఇటువంటి బహిరంగ లేఖలు రాయడం ప్రసన్న కుమార్ రెడ్డికి సహజమేనని గత ఉదంతాలను కొంత మంది తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications