గాంధీలో గర్భిణి మృతి: డాక్టర్లపై దాడి
హైదరాబాద్: సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో గర్భిణి మృతి బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గాంధీ ఆస్పత్రిలో మరణించి మహిళ బంధువులు వైద్యులపై దాడి చేశారు. లేబర్ రూంపై కూడా దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. దీంతో గర్భిణీ స్త్రీలు భయంతో బయటకు పరుగులు తీశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మహిళ మరణించిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆగ్రహం చెంది ఈ దాడికి పాల్పడ్డారు.
తమపై జరిగిన దాడిని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా పరిగణించారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విధులను బహిష్కరించారు. తమకు న్యాయం చేయకపోతే అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications