రాష్ట్రవ్యాప్త సమ్మె: జూ.డాక్టర్లు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి జూనియర్ వైద్యులు గురువారంనాడు కూడా తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. తమపై ఆసుపత్రికి వచ్చినవారు దాడి చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. దాడి చేసినవారిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లంతా సమ్మె చేస్తారని జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు హెచ్చరించారు.
గాంధీ ఆస్పత్రిలో ఒక గర్భిణీ స్త్రీ మరణించడంపై ఆగ్రహం చెందిన ఆమె బంధువులు వైద్యులపై దాడి చేశారు. లేబర్ రూంలో విధ్వంసం సృష్టించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వైద్య శాఖ మంత్రి దానం నాగేందర్ హామీ ఇచ్చినా జూనియర్ డాక్టర్ వినడం లేదు.












Click it and Unblock the Notifications